Posts

Showing posts from March, 2019

అసమర్ధ జర్నలిస్ట్ 1 - 30

Image
1 మీరు ప్రభుత్వాన్ని కదిలించే వార్త రాయగలరా ? అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించే కథనం రాసే దమ్ము మీకుందా ? ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి .. చేయూతనివ్వాలనే మనసు కలిగి ఉన్నారా ? అయితే మీలాంటి వారికే ఆహ్వానం పలుకుతోంది నిప్పు పత్రిక .. వ్యక్తిగా చేరండి .. శక్తిగా ఎదగండి .. సమాజాన్ని నడిపించండి .. సమ సమాజాన్ని సాధించే కార్యకర్తగా నిలవండి .. నిప్పు జర్నలిజం స్కూల్ అందిస్తున్న జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ప్రవేశానికి దరఖాస్తు చెయ్యండి . నిప్పు పత్రికలో పబ్లిష్ అయిన ఈ ప్రకటనని కాటంగారి నాగరాజు చదవడం ఇది నలభై నాలుగో సారి . నెలరోజులుగా లేచిన వెంటనే దీన్ని చదువుతాడు . ఇందులోని ప్రతి అక్షరం అతనికి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది . ఈ ప్రకటన ప్రచురితమైన పది రోజులకే దరఖాస్తు చేసుకున్నాడు . నేటి రాజకీయ వేడిపై మంచి వ్యాసం రాసి పంపించాడు . అర్హత పరీక్షకు పిలుపువస్తుందని ఎదురుచూస్తున్నాడు . ఇంకా లెటర్ రాలేదు . తనకి ఈ ఉద్యోగంలో చేరే అర్హతలు ఏమైనా తగ్గాయా ? అని మరో