Posts

Showing posts from April, 2019

అసమర్ధ జర్నలిస్ట్ 101 - 143

Image
101 " మహారాణి ఛానెల్ పరిస్థితి ఎలా అంది ?" " స్టార్స్ ఛానెల్లో కనిపించేసరికి ఆగడం లేదు . రోజు రోజుకి సబ్ స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు . నాలుగు లక్షలకు చేరారు . అలాగే వీడియో పెడితే ఐదు లక్షలకు వెళ్ళిపోతోంది . మొన్న టాప్ టెన్ ట్రెండింగ్ వీడియో లో మహారాణి ఉంది " " నేనూ చూసాను . ఆ ఛానెల్ లైన్లో పడిపోయింది . కాబట్టి మరో ఛానెల్ పెడదామని అనుకుంటున్నాను " " ఎవరా అమ్మాయి ?" " అమ్మాయి కాదు .. అబ్బాయి " " అబ్బాయిలను ఎవరు చూస్తారు " " కరెక్ట్ గానీ ఓ కిటుకు ఉంది . ఇప్పుడు యూట్యూబ్ లో పవన్ మానియా నడుస్తోంది . పవన్ ని తిట్టినా , పొడిగినా వ్యూస్ పెరిగిపోతున్నాయి . పవన్ పేరు కనిపిస్తే చాలు షేర్లు విపరీతంగా వస్తున్నాయి . పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ జోరు పెరిగిపోయింది . చూసావుగా కత్తి సురేష్ కి ఎంత క్రేజ్ వచ్చిందో .." " మనం కూడా పవన్ ని తిడుతామా " " అలా అయితే ఛానెల్ ని మూయించేస్తారు ఫ్యాన్స్ " " అవును ఏద